Oct 14,2021 17:33
11 మద్యం బాటిళ్లు స్వాధీనం ఒకరు అరెస్ట్‌.

ప్రజాశక్తి -రైల్వేకోడూరు.
11 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్టు చేసినట్లు ఎస్‌ఈబి. ఇనిస్పెక్టర్‌ చంద్ర శేఖర్‌ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సిబ్బందితో కలిసి నాటుసారా, బెల్ట్‌ షాపులు , అక్రమ మద్యంలపై కోడూరు మండల పరిధిలో దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా బయనపల్లి క్రాస్‌ వద్ద గుండాల పల్లికి చెందిన సింగిరి చంద్రశేఖర్‌ అను వ్యక్తి వద్ద నుండి ఒక ప్లాస్టిక్‌ గోతములో 11 మద్యము బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు. అనంతరం కోర్టుకు హాజరు పరచగా కోర్టు సదరు ముద్దాయికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారని తెలిపారు. ఈ దాడులలో కోడూరుసబ్‌ ఇనిస్పెక్టర్‌ నరసింహరావు, హెడ్‌ కానిస్టేబుల్స్‌ రామచంద్ర, ప్రసాద్‌, కానిస్టేబుల్స్‌ విజయ,ప్రసాద్‌ పాల్గన్నారు.