
ఇరగవరం (పశ్చిమ గోదావరి) : అనధికార మందులను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తణుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ ఆలీషేక్ హెచ్చరించారు. సోమవారం మండలంలోని కొత్తపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం భవనం వద్ద అనధికారికంగా ఇంగ్లీషు మందులు విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. స్థానికంగా ల్యాబ్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తి రాజమహేంద్రవరానికి చెందిన డాక్టర్ను తీసుకువచ్చి వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ క్రమంలో గ్రంధి వెంకటరమణ అనే వ్యక్తి షుగర్ నియంత్రణకు వినియోగించే ఇన్సులిన్, కొన్ని రకాల ఇంజక్షన్లను ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా బాక్సుల్లో విక్రయిస్తున్నారు. అతని వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన 114 రకాల అనధికార మందులను సీజ్ చేశారు.