May 15,2022 07:53

దేహ్రాదూన్‌ : 'చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభించిన 12 రోజుల్లో 31 మంది యాత్రికులు, బద్రినాథ్‌ స్థానికులు ఒకరు మృతి చెందారు. 'వారంతా బీపీ, గుండెపోటు, మౌంటైన్‌ సిక్‌నెస్‌ కారణంగా చనిపోయారు' అని ఉత్తరాఖండ్‌ డైరెక్టర్‌ జనరల్‌ హెల్త్‌ డాక్టర్‌ శైలజా భట్‌ మీడియాకు వెల్లడించారు. ఈ పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆరోగ్యంగా ఉన్నవారినే తీర్థయాత్రలకు అనుమతించే విధంగా వైద్య పరీక్షలు ప్రారంభించింది. అందుకోసం యాత్ర ప్రారంభ మార్గాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది. అనారోగ్యమని తేలినవారు విశ్రాంతి తీసుకోవాలి, కోలుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా చార్‌ధామ్‌ యాత్ర నిలిచిపోయింది. దాంతో ఈ సారి రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.