Oct 02,2022 20:44

- తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డులో తూరుమామిడి బాలుడు సాత్విక్‌కు చోటు
ప్రజాశక్తి ా మక్కువ (పార్వతీపురం) :పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం తూరుమామిడికి చెందిన యాసర్ల సాత్విక్‌ 37 నిమిషాలలో 1200 గుంజీలు (సిట్‌ అప్స్‌) ఆగకుండా తీసి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీనిని తెలుగు బుక్‌ అఫ్‌ రికార్డు వారు గుర్తించి అవార్డును ప్రదానం చేశారు. విజయవాడలోని ప్రైవేటు పాఠశాలలో సాత్విక్‌ నాలుగవ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి శ్రీహరి విజయవాడలోని సిఐడి విభాగంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా సాత్విక్‌ మాట్లాడుతూ తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్‌ శ్రీనివాసరావు శిక్షణ వల్ల ఈ ఘనత సాధించినట్లు తెలిపాడు. భవిష్యత్తులో మరిన్ని రికార్డ్స్‌ సాధిస్తానని చెప్పారు. సాత్విక్‌ను సర్పంచ్‌ రెడ్డి కృష్ణం నాయుడు అభినందించారు.