
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కోవిడ్ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 43,763 శ్యాంపిల్స్‌ను పరీక్షించగా, 12,926 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు వైద్యారోగ్యశాఖ శనివారం బులిటెన్‌లో పేర్కొంది. విశాఖలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఒకరితో కలిపి మొత్తం ఐదుగురు కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,538కి చేరింది. కరోనా నుంచి 3,913 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 73,143 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7.77 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు వేసినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. అందులో 4.26 కోట్ల మందికి మొదటి డోసు, 3.46 కోట్ల మందికి రెండో డోసు వేయగా, ప్రికాషన్ డోసు 4.66 లక్షల మందికి వేసినట్లు అధికారులు తెలిపారు.