Jun 09,2021 20:51

12న 'స్వాతంత్య్ర సమరయోధులు'పై కవి సమ్మేళనం
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌
అజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఎపి భాషా సాంస్కృతికశాఖ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ఆధ్వర్యంలో ఈనెల 12న 'స్వాతంత్య్ర సమరయోధులు' అనే అంశంపై కవి సమ్మేళనం జరుగుతుందని ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్‌.మల్లికార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ పూర్వ సభ్యులు, రాష్ట్రప్రభుత్వ గుర్రం జాషువా అవార్డు గ్రహీత డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌ ఈ కవి సమ్మేళనానికి సమన్వయ కర్తగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ కవి సమ్మేళనంలో ఎపి శ్రీనివాస్‌ వాసుదేవ్‌(విశాఖపట్టణం), షేక్‌మహ్మద్‌ రఫీ (ఈ-వేమన,కడప), కొల్లి రమాదేవి (పశ్చిమగోదావరి), డాక్టర్‌ పుల్లేటికుర్తి ఎస్‌వి శ్రీనుబాబు(కృష్ణా), మువ్వల జ్యోతి (విశాఖ), సూరా రత్నలక్ష్మి (కర్నూలు), మిరప మహేష్‌ (తూర్పుగోదావరి), విదూరారెడ్డి (అనంతపురం),సుధామురళి (నెల్లూరు), సిరికి స్వామినాయుడు(విజయనగరం), అరుణ్‌బవేరా(శ్రీకాకుళం), వాసి జ్యోత్స్న (గుంటూరు), పిల్లి హజరత్తయ్య (ప్రకాశం), గొడ్డ సరేంద్ర (చిత్తూరు), యడవల్లి శ్రీనివాసరావు (విజయవాడ), డాక్టర్‌ ఆరవల్లి నరేంద్ర(నిడదవోలు) పాల్గొంటారని ఆర్‌.మల్లికార్జునరావు వివరించారు.