Jul 05,2022 12:28

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్‌ వ్యాప్తి స్వల్ప హెచ్చు తగ్గులతో కొనసాగుతోంది. తాజాగా 4.51 లక్షల మందికి కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,086 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో పాజిటివిటీ రేటు 2.90 శాతంగా నమోదైంది. ముందురోజు 16 వేల కేసులు రాగా.. తాజాగా ఆ సంఖ్య తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. క్రియాశీల కేసులు 1,14,475(0.26) కి చేరాయి. నిన్న 12,456 మంది కోవిడ్‌ నుండి కోలుకోగా.. రికవరీ రేటు 98.53 శాతానికి తగ్గిపోయింది.

                                               24 గంటల్లో 24మంది మృతి : కేంద్ర ఆరోగ్యశాఖ

24 గంటల వ్యవధిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారని మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ రెండేళ్ల కాలంలో 4.35 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.28 కోట్ల మందికి పైగా వైరస్‌ను జయించారు. ఇక గత ఏడాది ప్రారంభం నుంచి 198 కోట్లకు పైగా జనాభాకు డోసులు పంపిణీ అయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ మాట్లాడుతూ ... దేశ జనాభాలో 90 శాతం మంది వయోజనులకు పూర్తిస్థాయి టీకా అందినట్లు వెల్లడించారు.