Oct 27,2021 19:30

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ''భోళా శంకర్‌'' రూపొందనున్న విషయం తెలిసిందే. సిరుతై శివ దర్శకత్వంలో అజిత్‌ కుమార్‌, లక్ష్మీ మీనన్‌ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ యాక్షన్‌ డ్రామా 'వేదాళం' రీమేక్‌. ఇందులో చిరు సోదరిగా కీర్తి సురేష్‌ నటిస్తుంది. నవంబర్‌ 11న ఉదయం పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ''భోళా శంకర్‌'' బృందం ప్రకటించింది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ నవంబర్‌ 15 నుండి ప్రారంభమవుతుంది. ఎక్కువ భాగం షూటింగ్‌ కోల్‌కతాలో జరుగుతుంది. చిరంజీవి సరసన జతకట్టనున్న హీరోయిన్‌ పేరును త్వరలో ప్రకటిస్తారు. మహతి స్వర సాగర్‌ సంగీతం అందించనున్నారు. నిర్మాత అనిల్‌ సుంకర క్రియేటివ్‌ కమర్షియల్స్‌తో కలిసి ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.