Mar 18,2023 21:26

హైదరాబాద్‌ : ఆతిథ్య వేదిక ఓయో కొత్తగా హైదరాబాద్‌లో 150కు పైగా ప్రీమియం హోటళ్లను జోడించనున్నట్లు తెలిపింది. 2023కి గాను ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు పేర్కొంది. నగరంలోని కీలక ప్రాంతాల్లోని తమ ప్రీమియం హోటళ్ల బ్రాండ్లలో టౌన్‌హౌస్‌ ఓక్‌, టౌన్‌హౌస్‌, కలెక్షన్‌ ఓ, క్యాపిటల్‌ ఓ ఉండనున్నాయని పేర్కొంది. గచ్చిబౌలి, హైటెక్‌ సిటీ, లకిడీకాపూల్‌, ఎయిర్‌పోర్ట్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో విస్తరణపై దృష్టి పెట్టినట్లు పేర్కొంది. గతేడాది అక్టోబర్‌ ా డిసెంబర్‌ కాలంలో దేశ వ్యాప్తంగా కొత్తగా 400 నూతన ప్రీమియం హోటళ్లను జోడించినట్లు పేర్కొంది.