
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యూఢిల్లీ అల్లర్ల కేసులను విచారిస్తును న్యాయమూర్తితో సహా తన పరిధిలోని వివిధ కోర్టుల్లో 16 మంది జడ్జీలను ఢిల్లీ హైకోర్టు బదిలీ చేసింది. ఢిల్లీ అల్లర్ల కేసులను విచారించేందుకు నియమించిన ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒక జడ్జితో సహా మొత్తం 16 మంది న్యాయాధికారులను బదిలీ, పోస్టింగ్ అలాట్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో అదనపు సెషన్స్ జడ్జి వీరేందర్ భట్, ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోనికర్కర్దూమా కోర్టులో అల్లర్ల కేసులను విచారించడానికి నియమితులయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో, ఢిల్లీ అల్లర్ల కేసులను విచారిస్తున్న అదనపు సెషన్స్ జడ్జి వినోద్ యాదవ్‌తో సహా 11 మంది జ్యుడీషియల్ అధికారులు బదిలీ అయ్యారు. భట్‌తో పాటు బరా? గుప్తా, పంకజ్ గుప్తా, సంజీవ్ కుమార్ అగర్వాల్, ఉమేద్ సింగ్, హేమానీ మల్హోత్రా, వినీతా గోయల్, సంజీవ్ అగర్వాల్, సంజీవ్ కుమార్ మల్హోత్రా, కిరణ్ బన్సాల్, రాకేష్ కుమార్, ఆశిష్ అగర్వాల్, షుచి లల్లెర్వాల్, ప్రియా మహేంద్ర, శరద్ గుప్తా, అజరు గార్గ్ వంటి 15 మంది న్యాయాధికారులు ప్రస్తుతం వివిధ స్థానాలకు బదిలీ అయ్యారు.