
నిరసన తెలుపుతున్న రెవెన్యూ ఉద్యోగులు
ప్రజాశక్తి-శ్రీకాకుళం అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి జెఎసి పిలుపు నందుకుని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గడచిన 16 రోజులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు శుక్రవారం కొనసాగించారు. తహశీల్ధారు కార్యాలయాల ఎదుట మద్యాహ్న బోజన విరామ సమయాన నిరసన చేపట్టారు. శ్రీకాకుళం తహశీల్ధారు కార్యాలయం ఎదుట చేప్టిన నిరసన కార్యక్రమంలో రెవిన్యూ సర్వీసుల సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి బివివిఎన్ రాజు హాజరై మాట్లాడారు. ఉద్యోగ, ఉపాద్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధనకై ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అందులో బాగంగా గడచిన నాలుగు రోజులుగా వర్కు టు రూల్ పాటిస్తూ తమ నిరసన తెలుపు తున్నా మన్నారు. ఈకార్యక్రమం లో రెవిన్యూ ఉద్యోగులు హాజరయ్యారు.