
- 150మందికి గాయాలు
పెషావర్ : వాయువ్య పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో మసీదు లోపల సోమవారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మరణించిన వారిలో ఎక్కువమంది పోలీసులు, పోలీసు అధికారులే ఉన్నారు. దాడికి లక్ష్యంగా పెట్టుకును మసీదు విశాలమైన కాంపౌండ్‌లో వుంది. ఆ కాంపౌండ్‌లోనే నగర పోలీసు ప్రధాన కార్యాలయం, ఇంటెలిజెన్స్, తీవ్రవాద నిరోధక దళం కార్యాలయాలు వునాుయి. ఈ దాడి నేపథ్యంలో దేశమంతా అప్రమత్తతను ప్రభుత్వం ప్రకటించింది. పేలుడు ధాటికి మసీదు గోడ మొత్తంగా, పైన కప్పు కొంత భాగం లేచిపోయాయి. అనేకమంది పోలీసులు శిధిలాల్లో చిక్కుకుపోయారని, వారిని వెలికితీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పెషావర్ పోలీసు చీఫ్ మహ్మద్ ఇజాజ్ ఖాన్ తెలిపారు. సాధారణంగా మసీదులో ప్రార్థనలకు 300 నుంచి 400మంది అధికారులు హాజరవుతూ వుంటారనిచెప్పారు. ఇదొక అత్యవసర పరిస్థితి అనిపెషావర్‌లోని ప్రధాన ఆస్పత్రి ప్రతినిధి మహ్మద్ ఆసిం ఖాన్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌కు రక్షణగా విధులను నిర్వరిస్తును వారినిలక్ష్మంగా చేసుకునితీవ్రవాదులు భయోత్పాతాన్ని సృష్టించాలనుకున్నారని పాక్ ప్రధాని షెహబాష్ షరీఫ్ వ్యాఖ్యానించారు. ప్రార్థన జరుపుతున్న వారిలో రెండవ వరుస నుండి దాడి జరిగిందని, ఆత్మాహతి దాడి అని భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇమామ్ ప్రార్థనలు ప్రారంభించిన సెకన్లలోనే ఈ దాడి జరిగింది. మంగళవారం ఐఎంఎఫ్ ప్రతినిధి బృందంతో పాకిస్థాన్ చర్చలు జరపాల్సి వుంది. దాడికి పాల్పడిన బాంబర్ ప్రవాసంలో వును ఆఫ్ఘన్ వాసి అని డిటెక్టివ్‌లు తెలిపారు.