Oct 13,2021 20:52

హైదరాబాద్‌ : దక్షిణ భారతదేశ ప్రీమియం జ్యుయలరీ ట్రేడ్‌ షో అయినా హైదరాబాద్‌ జ్యుయలరీ పెర్ల్‌ అండ్‌ జెమ్‌ ఫెయిర్‌ (హెచ్‌జెఎఫ్‌) ఐకానిక్‌ షో ఈ నెల 18ా20వ తేదిల్లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది. హైటెక్‌ సిటీలోని హెచ్‌ఐసిసి నోవాటెల్‌ వద్ద ఈ ప్రదర్శన జరుగుతుందని పేర్కొంది. ఇందులో ప్రముఖ జ్యుయలర్‌ సంస్థలు, ఎగుమతి, దిగుమతి వ్యాపార సంస్థలు, పరిశ్రమ సంఘాలు ఈ ప్రదర్శనలో పాల్గంటున్నాయని తెలిపింది.