
ప్రజాశక్తి-రేపల్లె: స్థానిక 20, 21వ వార్డులో టిడిపి ఆధ్వర్యంలో గురువారం జగనన్న బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు ముందుగా ఉప్పూడి రోడ్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డులోని ప్రతి ఇంటికి తిరిగి బాదుడే బాదుడు కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ధ్వజమెత్తారు. కరెంటు ఛార్జీల పెంపు, కరెంటు కోతలు, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఆర్టిసి బస్సు ఛార్జీల పెంపు ఇలా అన్ని వస్తువుల ధరలు పెంచి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ వస్తువు కొనాలన్నా భయపడే స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అని వ్యాఖ్యానించారు. ఇటువంటి ప్రభుత్వంలో మధ్యతరగతి వాడు జీవించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజలకు ఈ విషయాలు సూటిగా చెప్పాలనే భావనతోనే ఈ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ ఉపాధక్షలు దండమూడి ధరణి కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి మురళీధర్ రావు, అన్ని రామకృష్ణ, జివి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు జీవి రామారావు, వెనిగళ్ళ శివ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ గని, శాస్త్రి, సుభాని, దాసరి అమర్నాథ్, శేఖర్, నాగేశ్వరరావు, మద్దుల అంకాలు, నీలా కోటేశ్వరరావు, తాడిపత్రి మల్లికార్జునరావు, మొహిద్దీన్ చెన్ను నాగమల్లేశ్వరరావు, ముస్తఫా, వీరాంజనేయులు, నల్లూరు అజరు కుమార్, ఆలూరు సురేష్, యలవర్తి శ్రీలక్ష్మి, సాయిగోపి, పి బోయిన గోపి, దామెర్ల రాజారావు, రేపల్లె సురేష్, లక్ష్మీ నరసమ్మ, తిరుపతయ్య ఖాదర్ బాషా, చింతారావు తదితర నాయకులు పాల్గొన్నారు.