Jun 23,2022 12:18

గువహటి : మహారాష్ట్ర ప్రభుత్వంలో మొదలైన రాజకీయ సంక్షోభం.. అసోంలోని గువహటి హోటళ్లకు చేరింది. మహారాష్ట్రలోని వికాస్‌ అఘాడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగు బావుటా వేసిన శివసేన ఎమ్మెల్యేలంతా గువహటి హోటల్లోనే మకాం వేశారు. ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎంపిలు గురువారం ఉదయం అసోంకు చేరుకున్నట్లు తెలుస్తోంది.తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఏక్‌నాథ్‌ షిండే.. తమ సామర్థ్యాన్ని చాటుకునేందుకు గవర్నర్‌కు కలిసే అవకాశముంది. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. తమపై చర్యలు తీసుకోకుండా ఉండాలంటే.. 37 మంది ఎమ్మెల్యేలు షిండే వైపు ఉండాలి. కానీ సోషల్‌ మీడియా విడుదలైన ఓ లేఖ ప్రకారం.. ఆయన వెంట 35 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా, 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని షిండే చెబుతున్నారు. కాగా, తమదే శివసేన పార్టీ అని, శాసన సభ పక్షనేతగా షిండేను ప్రకటించాలని గవర్నర్‌కు పలువురు రెబల్‌ నేతలు లేఖ రాశారు

సంజయ్ రౌత్‌

20 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు : సంజయ్ రౌత్‌
అయితే గువహటిలో ఉన్న 20 మంది రెబల్‌ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని సంజయ్ రౌత్‌ వ్యాఖ్యానించారు. ఏ పరిస్థితుల్లో, ఒత్తిడితో వారు అక్కడికి వెళ్లాల్సి వచ్చిందో.. మహారాష్ట్రకు వారంతా వచ్చినప్పుడు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కాగా, రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభంపై మహా వికాస్‌ అఘాడీలోని శివసేన, ఎన్‌సిపిలు సమావేశాలు నిర్వహించనున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే నేతృత్వంలోని ఎమ్మెల్యేలంతా అధికారిక కార్యాలయం వర్షాకు చేరుకుంటున్నారు. పలువురు రెబల్‌ ఎమ్మెల్యేలు తిరిగి గువహటి నుండి వెనక్కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఎన్‌సిపి నేత జయంత్‌ పాటిల్‌ అన్నారు. దీనిపై సాయంత్రం ఐదు గంటలకు ఎన్‌సిపి ఎమ్మెల్యేలు, ఎంపిలు ముంబయిలో సమావేశం కానున్నట్లు తెలిపారు.

#WATCH | Shiv Sena leaders arrive at the family residence of CM Uddhav Thackeray 'Matoshree' in Mumbai, amid #MaharashtraPoliticalCrisis pic.twitter.com/CMollN6Q2n

 


టిఎంసి నేతల నిరసనలు

కాగా, మహారాష్ట్రలో బిజెపి సర్కార్‌ చేస్తున్న ఆపరేషన్‌ కమల్‌ను వ్యతిరేకిస్తూ.. గువహటిలో ఎమ్మెల్యేలు మకాం వేసిన రాడిసన్‌ బ్లూ హోటల్‌ ఎదుట టిఎంసి నేతలు ఆందోళనలకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసోంలో వరదల కారణంగా 20 లక్షల మంది ప్రజలు ప్రభావితమైతే పట్టించుకోని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత శర్మ.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడంలో బిజీగా ఉన్నారని టిఎంసి నేత ఒకరు వ్యాఖ్యానించారు.

 

#WATCH | Shiv Sena leaders arrive at the family residence of CM Uddhav Thackeray 'Matoshree' in Mumbai, amid #MaharashtraPoliticalCrisis pic.twitter.com/CMollN6Q2n  — ANI (@ANI) June 23, 2022