Sep 22,2022 20:51

ముంబయి : చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌ తమ పైలట్లకు జీతాలు పెంచినట్లు తెలుస్తోంది. తమ వ్యాపారం మెరుగు పడుతున్న క్రమంలో వచ్చే అక్టోబర్‌ నుంచి పైలట్లకు 20శాతం జీతం పెంపునకు అంగీకరించిందని ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది. సంస్థలోని కెప్టెన్లు , సీనియర్‌ ఫస్ట్‌ ఆఫీసర్లకు జీతం దాదాపు 20 శాతం పెరుగుతుందని పేర్కొంది.