Aug 19,2022 12:59

ప్రజాశకి - పాడేరు : కారులో అక్రమంగా తరలిస్తున్న 200 కేజీల గంజాయితోపాటు స్మగ్లర్‌ వద్దనున్న ఏకే47 తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేట మార్గంలో తనిఖీలు చేపట్టగా పోలీసులను చూసి ఇద్దరు నిందితులు కారులోంచి దూకి పారిపోయారు. దీంతో కారు బోల్తాపడింది. కారును ద్విచక్రవాహనంపై అనుసరిస్తున్న నిందితుల సహచరుడు ముంచంగిపుట్టు మండలం కొండపడ గ్రామానికి చెందిన స్మగ్లర్‌ గణేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కారులో ఉన్న తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.