Jul 03,2022 22:18

ప్రజాశక్తి - సామర్లకోట రూరల్‌ పెదబ్రహ్మదేవంలోని శ్రీ శారదా రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కిరణ్‌ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఆదివారం నిర్వహించిన వైద్య శిబిరంలో సుమారు 200 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. సుమారు 36 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. వారిని కాకినాడ అచ్చంపేటలోని కిరణ్‌ కంటి ఆసుపత్రికి తీసుకొని వెళ్ళి శస్త్ర చికిత్సలు చేస్తామని సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్‌ తెలిపారు. ఆదివారం ఎంపిటిసి సభ్యులు మలకల సూర్యారావు రిబ్బన్‌ కట్‌ చేసి శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ శారదా రామకృష్ణ సేవా సమితి ద్వారా గ్రామంలో 60 ఏళ్ల నుంచి తనదైన శైలిలో సేవలు చేస్తూ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. సమితి సభ్యులు తమ పుట్టిన రోజు పెళ్లిరోజులను సమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి ప్రజలకు సేవ చేయడం అభినందనీయం అన్నారు. సమితి అధ్యక్షుడు తోటకూర గంగాధర్‌ తన పుట్టిన రోజున ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. శిబిరంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. శ్రీ కిరణ్‌ కంటి ఆసుపత్రి పెద్దాపురం బ్రాంచ్‌ కో ఆర్డినేటర్‌ ఎం.దుర్గా ప్రసాద్‌ నేతత్వంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్‌ అవసరమైన వారిని ఈ నెల 21వ తేదీన బస్‌లో తీసుకు వెళ్లి కాకినాడలో ఆపరేషన్‌ చేస్తారని తెలిపారు. గ్రామంలోని ఎఎన్‌ఎం, సిబ్బంది వారికి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి డాక్టర్‌ వైవిబి.ప్రసాదరావు, గ్రామ సర్పంచ్‌ నీలపాల సత్యనారాయణ, సొసైటీ అధ్యక్షులు మలకల వరాల బాబు, అన్నపూర్ణ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సొసైటీ అధ్యక్షుడు తోటకూర శ్రీనివాస ప్రకాశరావు, సమితి కార్యదర్శి వింజమూరి విశ్వనాథ్‌, సభ్యులు టివివి.సత్యనారాయణ, నువ్వుల బాబ్జి, తేలుగుంట్ల నరసింహారావు, టి.సాంబశివరావు, కేదారశెట్టి సతీష్‌, సొసైటీ డైరెక్టర్‌ పేపకాయల సత్తిబాబు, తోటకూర సత్తిబాబు పాల్గొన్నారు.