May 09,2021 23:23

కరోనా వైరస్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం 2099 మందికి వైరస్‌ నిర్ధారణవడంతో ఇప్పటి వరకు పాజిటివ్‌ల సంఖ్య 1,21,481కు చేరింది. మరోవైపు బాధితుల్లో మరో 12 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కరోనా మరణాలు 844కు పెరిగాయి. 17,764 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారు.
వివిధ ప్రాంతాల్లో పాజిటివ్‌ల వివరాలు
గుంటూరు కార్పొరేషన్‌ 793, గుంటూరు రూరల్‌ 26, అమరావతి 63, క్రోసూరు 11, మంగళగిరి 148, మేడికొండూరు 16, పెదకాకాని 16, ముప్పాళ్ల 6, పెదనందిపాడు 4, ప్రత్తిపాడు 11, పెదకూరపాడు 36, సత్తెనపల్లి 68, తాడేపల్లి 55, తాడికొండ 12, తుళ్లూరు 48, వట్టిచెరుకూరు 9, ఫిరంగిపురం 6, అచ్చంపేట 2, బెల్లంకొండ 4, రాజుపాలెం 4, వెల్దుర్తి 4, మాచర్ల 91, పిడుగురాళ్ల 27, రెంటచింతల 6, కారంపూడి 21, దుర్గి 15, దాచేపల్లి 19, మాచవరం 4, గురజాల 29, చిలకలూరిపేట 49, యడ్లపాడు 9, ఈపూరు 19, నర్సరావుపేట 89, రొంపిచర్ల 12, నూజెండ్ల 10, నకరికల్లు 12, వినుకొండ 9, శావల్యాపురం 4, నాదెండ్ల 29, బొల్లాపల్లి 3, అమృతలూరు 7, భట్టిప్రోలు 16, బాపట్ల 45, చేబ్రోలు 12, చెరుకుపల్లి 26, దుగ్గిరాల 21, కాకుమాను 7, కొల్లిపర 9, కొల్లూరు 7, పివి పాలెం 9, రేపల్లె 15, పొన్నూరు 16, తెనాలి 23, చుండూరు 5, వేమూరు 6, కర్లపాలెం 4, నగరం 11, నిజాంపట్నం 21.
గుంటూరు నగరంలో.. ఏటి అగ్రహారం 12, బ్రాడీపేట 30, అన్నపూర్ణనగర్‌ 4, గోరంట్ల 18, చంద్రమౌళి నగర్‌ 13, పట్టాభిపురం 18, బాలాజీనగర్‌ 4, అమరావతి రోడ్డు 17, అరండల్‌పేట 13, బృందావన్‌ గార్డెన్స్‌ 18, పాత గుంటూరు 23, కృష్ణనగర్‌ 14, గుజ్జనగుండ్ల 11, శ్యామలానగర్‌ 14, శ్రీనివాసరావుతోట 12, శ్రీనివాసరావుపేట 7, ఆటోనగర్‌ 29, కొరిటపాడు 10, సంగడిగుంట 14, చౌడవరం 7, రాజేంద్రనగర్‌ 4, అంబేద్కర్‌నగర్‌ 3, అనందపేట 3, అశోక్‌నగర్‌ 2, చైతన్యపురి కాలనీ 7, లాలాపేట 14, కొత్తపేట 9, ఆంజనేయపేట 2, నెహ్రూనగర్‌ 17, చుట్టుగుంట 3, అరుంధతినగర్‌ 4, భారత్‌పేట 17, గుటూరు వారితోట 12, ముత్యాలరెడ్డి నగర్‌ 6, నల్లచెరువు 15, ఐపిడి కాలనీ 14, స్వర్ణభారతి నగర్‌ 16, ఎన్‌టిఆర్‌ నగర్‌ 32, కోబాల్టుపేట 4, దేవాపురం 3, ఆర్‌.అగ్రహారం 3, చౌత్రా 7, నవభారత్‌నగర్‌ 4, ఆర్‌టిసి కాలనీ 30, స్తంభాల గరువు 12, ఎస్‌విఎన్‌ కాలనీ 7, హౌసింగ్‌ బోర్డు కాలనీ 2, ఎన్‌జివో కాలనీ 6, బుచ్చయ్యతోట 2, ద్వారకా నగర్‌ 3, నల్లపాడు 10, రైలుపేట 8, శ్రీనగర్‌ 17, గాంధీనగర్‌ 7, రెడ్డిపాలెం 13, శారదాకాలనీ 24, వెంకట రమణకాలనీ 2, హనుమయ్యనగర్‌ 3, లాలాపేట 2, నగరంపాలెం 3, లాల్‌పురం 5, మారుతీనగర్‌ 16, శ్రీరాంనగర్‌ 11, క్రిస్టియన్‌ పేట 2, ఏటుకూరు రోడ్డు 3, కృష్ణబాబు కాలనీ 9, జెకెసి కళాశాల రోడ్డు 3, పిఎస్‌నగర్‌ 8, యాదవ బజార్‌ 2, లాం 2, వసంతరాయపురం 14, డొంకరోడ్డు 3, నేతాజీనగర్‌ 2, ఎన్‌ఎస్‌పి కెనాల్‌ క్వార్టర్స్‌ 3, సంపత్‌నగర్‌ 6, వెంగళరావు నగర్‌ 4, గణేష్‌నగర్‌ 3, నలందనగర్‌ 3, ఎల్‌ఆర్‌ కాలనీ 5, పలకలూరు 4, రామిరెడ్డి తోట 2, ఉద్యోగనగర్‌ 2, వేళంగణి నగర్‌ 7, మద్దిరాల కాలనీ 4, మల్లారెడ్డి నగర్‌ 3, వినోభానగర్‌ 2, మంగళదాస్‌ నగర్‌ 5, తుపాన్‌ నగర్‌ 6, కొండవారి వీధి 2, మునుస్వామి నగర్‌ 4, నాజ్‌సెంటర్‌ 3, శాయిబాబ కాలనీ 2, సుద్దపల్లి డొంక 4, వల్లూరివారితోట 3, సంజీవయ్యనగర్‌ 4, షాపు ఎంప్లాయీస్‌ కాలనీ 3, సిద్ధార్ధనగర్‌ 5, వికాస్‌నగర్‌ 7, భాగ్యనగర్‌ 10, గోపాలకృష్ణ కాలనీ 2, గుండారావుపేట 4, మాచిరాజు వారివీధి 2, వెంకటాద్రిపేట 4, నల్లకుంట 2, రామనామక్షేత్రం 2, వెంకట్రావుపేట 3, కళ్యాణనగర్‌ 2, చంద్రబాబు నాయుడు కాలనీ 5, ఫాతిమాపురం 4, శివరామ నగర్‌ 4, శ్రీనివాసనగర్‌ 3, ఉత్తర వారివీధి 3. మరో 22 ప్రాంతాల్లో ఒక్కొక్కరు వైరస్‌ బారిన పడ్డారు.