Dec 02,2021 02:52

సిఎమ్‌ కప్‌ పోస్టర్‌ను విడుదలచేస్తున్న చొక్కాకుల తదితరులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ఆధ్వర్యాన ఈ నెల 21 నుంచి సిఎం కప్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన వైఎస్‌ఆర్‌ కప్‌ పోస్టర్‌ను సెయింట్‌ అంథోనీ హైస్కూల్‌లో బుధవారం మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతను క్రీడా రంగంలో అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోందన్నారు. ఏటా నిర్వహిస్తున్న సిఎం కప్‌లో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. 29వ కార్పొరేటర్‌ ఉరికిటి నారాయణరావు మాట్లాడుతూ, ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌ ఎయు వైస్‌ ఛాన్సలర్‌ ప్రసాద్‌ రెడ్డి నిర్వహణలో జరుగుందన్నారు. జనవరి 9న జరిగే ముగింపు కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 29వ వార్డు నాయకులు కండిపల్లి సతీష్‌, చోల్లంగి శేఖర్‌, కిలాని వెంకటేష్‌, బొండాడ వెంకటరావు, సారిపల్లి వెంకటరమణ, బుల్లెట్‌ రవి, నర్సింగ్‌, రాజు పాల్గొన్నారు.
సీీతమ్మధార : జగన్మోహన్‌రెడ్డి జన్మదినం డిసెంబరు 21ని పురస్కరించుకొని సిఎం క్రికెట్‌ కప్‌ టోర్నీ పోస్టర్‌ను విశాఖపట్నం కాకినాడ పెట్రోలియం కెమికల్‌ అండ్‌ పెట్రోకెమికల్‌ ఇన్వెస్టుమెంట్‌ రీజియన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ చైర్‌పర్సన్‌ చొక్కాకుల లక్ష్మి, వైసిపి రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు, జీవీఎంసి 14వ వార్డు కార్పొరేటర్‌ కటారి అనీల్‌ కుమార్‌ రాజు కలిసి సీతమ్మధారలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చొక్కాకుల దంపతులను అనీల్‌కుమార్‌ రాజు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైసిపి సీటీ లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు కరణం కృష్ణ, వైసిపి రాష్ట్ర యువజన విభాగం జాయింట్‌ కార్యదర్శి నంబాల రాజేష్‌, సీనియర్‌ నాయకులు చొక్కాకుల రామకృష్ణ, దాసరి నాయుడు, తర్రా సతీష్‌, గోవింద పాల్గొన్నారు.