Jul 04,2022 00:15

ఆందోళన చేస్తున్న మత్స్యకారులు


ప్రజాశక్తి -నక్కపల్లి:హెటిరో పైప్‌లైన్‌ పూర్తిగా తొల గించాలని మత్స్యకార జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత మహాధర్నా అదివారం నాటికి 213 వ రోజుకు చేరింది. శిబిరం వద్ద మత్స్యకారులు పైప్‌ లైన్‌కు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. తామంతా పైప్‌ లైన్‌ను వ్యతిరేకిస్తూ 213 రోజుల నుండి ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం, అధికార యంత్రాంగం నేటి వరకు సమస్య పరిష్కారానికి మార్గం చూపకపోవడం అన్యాయమన్నారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో ఏపీ మత్స్యకార రాష్ట్ర విద్యార్ధి ప్రధాన కార్యదర్శి వాసిపిల్లి నూకరాజు, నాయకులు గోసల స్వామి, అర్జిల్లి శ్రీను, పీక్కి రమణ, కోడ కాశీ, వాసిపిల్లి స్వామి, కారే కోదండ, చేపల సోమేష్‌, తండేల మాధవ్‌ రాజు పాల్గొన్నారు.