Jan 15,2022 16:38

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో ఈనెల 23న జరగాల్సిన పల్స్ పోలియో కార్యక్రమం వాయిదా పడింది. కోవిడ్-19 కేసులు కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా విపరీతంగా పెరుగుతుండటంతో ఫిబ్రవరి 27కు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపినట్లు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్నిగమనించి అధికారులకు సహకరించాలని కోరారు.