Oct 17,2020 12:40

హైదరాబాద్‌ : 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్‌' మరో ప్రకటన చేసింది. అక్టోబర్‌ 23న హీరో ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ 'బీట్స్‌ ఆఫ్‌ రాధేశ్యామ్‌' పేరుతో మూవీ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతుంది. కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, టీ సిరీస్‌ బ్యానర్స్‌పై సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. 'వాళ్లు మిమ్మల్ని మరోసారి కచ్చితంగా ప్రేమలో పడేస్తారు. అక్టోబర్‌ 23న మోషన్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్నాం' అంటూ మేకర్స్‌ ప్రకటించారు. పీరియాడికల్‌ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న పూజా హెగ్డే పాత్ర పేరుతో చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.