
ప్రజాశక్తి-చింతూరు
మండలంలోని ఏడుగురాళ్లపల్లిలో సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ ధర్ ఆధ్వర్యాన శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏడుగురాళ్లపల్లి, పేగా, చుట్టుపక్క గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్య శిబిరానికి వచ్చారు. 250 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. పిల్లలకు ఆట వస్తువులు, క్యాలిమ్ బోర్డ్, చెస్, వాలీబాల్, ఫుట్బాల్ తదితర సామాగ్రిని అందించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ సెకండ్ హ్యాండ్ కమాండెంట్ కమల్ వీర్ యాదవ్, సిఆర్పిఎఫ్ ఎస్‌ఎంఓ డాక్టర్ కల్పన, ఏడుగురాళ్లపల్లి పీహెచ్సీ డాక్టర్ ప్రసన్న, ఏడుగురాళ్లపల్లి సిఆర్పిఎఫ్‌డి 141 ఓసి పసుపులేటి కాశయ్య, చింతూరు సీఐ అప్పలనాయుడు, ఎస్సై శ్రీనివాసరావు, సర్పంచులు సవలం సత్తిబాబు, చంద్రయ్య, సిఆర్పిఎఫ్ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.