
ప్రజాశక్తి - మామిడికుదురు
పాశర్లపూడిలో ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించి 257 మంది నేత్ర పరీక్షలు నిర్వహించారు. పాశర్లపూడి రిసార్ట్స్ నందు ఓయన్ జిసి రాజమహేంద్రవరం ఆసెట్ సహకారంతో ఢిిల్లీ అనుగ్రహ దష్టి దాన్, అమలాపురం లయన్స్ క్లబ్ సిష్టం జెసిఐ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి మెగా వైద్య శిభిరం నిర్వహించారు. నేత్ర పరీక్షల అనంతరం 122 మందికి కళ్లద్దాలు అందజేశారు. 15 మందికి ఆపరేషన్ అవసరమని గుర్తించారు. వేమగిరియోగానంద పరమ హంస కంటి ఆస్పత్రికి పంపించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ నవీద్ రావ్, లైన్ క్లబ్ ప్రెసిడెంట్ సిహెచ్. మధుశ్రీ, రీజనల్ చైర్ పర్సన్ మాకిరెడ్డి పూర్ణిమ, శివాణి, శ్రీ రామ, సర్పంచ్ కొనుకు ప్రేమజ్యోతి నాగరాజు, ఎంపిటిసి నెల్లి దుర్గా ప్రసాద్, అంకాని వీరాంజనేయులు, పిఎసిఎస్ చైర్పర్సన్ యువివి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.