
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను 25వ సవరణ ప్రక్రియను ద్వారా తొలగించడాన్ని తాను సమర్థించబోమని అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌పెన్స్ మంగళవారం వ్యాఖ్యానించారు. అయితే అధ్యక్షుడికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అభిశంసనకు ఓటు వేస్తానని హామీ ఇచ్చారు. 25 సవరణ ద్వారా అధ్యక్షుడిని తొలగించే చర్య మన దేశ ప్రయోజనాలకు, రాజ్యాంగానికి అనుగుణంగా ఉందని తాను భావించనని అన్నారు. అధ్యక్షుడి పదవీకాలంలో కేవలం ఎనిమిది రోజులు మాత్రమే మిగిలిఉన్నాయని, కాంగ్రెస్ క్యాబినెట్, తాను కలిసి 25వ సవరణను ప్రయోగించాలని మీరు, డెమోక్రటిక్ సభ్యుల సమావేశం కోరుకుంటున్నారని మైక్ పెన్స్ అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసీకి లేఖ రాశారు. ఈ ప్రక్రియతో ట్రంప్ విధులను నిర్వర్తించలేకపోవడంతో.. మిగిలిన పదవీకాలం కోసం యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా పెన్స్‌ను నియమించవచ్చు.