May 04,2021 09:14
  • బరిలో అసద్‌, మరో ఇద్దరు అభ్యర్థులు

డమాస్కస్‌ : ఈ నెల 26న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ పెట్టుకున్న దరఖాస్తును సిరియా అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఆమోదించింది. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపొందడం ఖాయమని భావిస్తున్నారు. ఇది అసద్‌ నిరంకుశ పాలనను సుస్థిరపరచుకునే యత్నమేనని సిరియా ప్రతిపక్షం, అమెరికా వ్యాఖ్యానించాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందితే అసద్‌ నాల్గోసారి అధికారం చేపట్టినట్లవుతుంది. మరో ఇద్దరు అభ్యర్ధులు అబ్దుల్లా సలేం అబ్దుల్లా, మహ్మద్‌ అహ్మద్‌ మారే పోటీ చేయడానికి కూడా కోర్టు ఆమోదం తెలిపింది. గత 20 ఏళ్లుగా అసద్‌ అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు.