Nov 26,2021 11:46

నెల్లూరు : అమరావతి రైతుల 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' పాదయాత్ర శుక్రవారంతో 26 వ రోజుకి చేరుకుంది. రాజుపాలెంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర సాయంత్రం నెల్లూరు నగరానికి చేరుకోనుంది. ముందుగా నేడు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్‌ చిత్రపటం వద్ద రైతులు నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని.. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే తమ భూములను ఇచ్చామని, ప్రభుత్వం పోలీసులతో ఎన్ని ఆంక్షలు పెట్టినా తమ పాదయాత్ర ఆపబోమని రైతులు స్పష్టం చేశారు.