Feb 07,2023 17:00

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం రూరల్‌ రాకొడు పీహెచ్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు ఏ.జగన్మోహనరావు, పీహెచ్సీ కార్యదర్శి వెంకటలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలు అందిస్తున్న ఆశా కార్యకర్తల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను తెగించి ప్రజల ప్రాణాలకు రక్షణగా ఆశా కార్యకర్తలు నిలబడ్డారన్నారు. మోడీ జగన్‌లు చప్పట్లు కొట్టి, పూలు జల్లి అభినందించారని, ఆషాలని మాత్రం వర్కర్లుగా గుర్తించడం లేదని, పిఎఫ్‌ ఈఎస్‌ఐ గ్రాడ్యుటీ వంటి చట్టపరమైన హక్కులు లేవని, కనీస వేతనం 26,000 అమలు కావడం లేదని అందుకే మార్చిలో చలో విజయవాడ, ఏప్రిల్‌ 5న చలో ఢిల్లీ కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని ఆశలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ధర్నలో పీహెచ్సీ ఆశ వర్కర్లందరూ పాల్గొన్నారు.