Jan 24,2023 00:06

రైతులతో మాట్లాడుతున్న నాయకులు

ప్రజాశక్తి - నాగులుప్పలపాడు : కిసాన్‌ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన రైతాంగ ఉద్యమంలో కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 26న ఒంగోలు నిర్వహిస్తున్న ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయాలని రైతు కౌలు రైతు సంఘాల జిల్లా నాయకులు జె.జయంతి బాబు, ఎస్‌కె.మాబు కోరారు. మండల పరిధిలోని అమ్మనబ్రోలు, చీర్వానుప్పలపాడు గ్రామాల్లో సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీ రైతాంగం ఏడాది పాటు చలి,వాన లెక్క చేయకుండా చేపట్టిన ఉద్యమం ఫలితంగా దిగివచ్చిన కేంద్రప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవ హరిస్తుందని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తి ధరలు పెరిగి పండించిన పంటలకు మద్దతు ధర లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతురన్నారు. రైతులు పండించిన వ్యవసాయ ఉత్తత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్‌ మీటర్లను ఎత్తివేయాలని, 2022లో తెచ్చిన విద్యుత్‌ సవరణ చట్టం ఎత్తివేయాలని, ఢిల్లీ ఉద్యమంలో చనిపోయిన రైతుకుటుంబాలకు నష్టపరిహరం అందించాలనే డిమాండ్లతో తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీలో రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ సంయుక్త మోర్చా నాయకులు చుంచు శేషయ్య, చుండూరి రంగారావు, హనుమారెడ్డి రైతులు తదితరులు పాల్గొన్నారు.