
వాషింగ్టన్ : అమెరికా తూర్పు తీరానికి అధిక గాలులు, మంచుతో కూడిన హిమ తుపాన్ ముప్పు పొంచి ఉన్న కారణంగా 2,700 విమానాలను విమానాయన సంస్థలు ఆదివారం రద్దు చేశాయి. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయానికి అమెరికాకు వచ్చే, వెళ్లే 2700 విమానాలు రద్దయ్యాయి. 1,500 పైగా విమానాలు ఆలస్యంగా నడవనున్నాయి. అమెరికన్ ఎయిర్లైన్స్ గ్రూప్ 600 విమానాలను రద్దు చేసింది.