May 15,2022 23:36

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న సురేంద్ర, నాయకులు

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:- ఈనెల 27న పాడేరులో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కిల్లో సురేంద్ర పిలుపునిచ్చారు. దోడిపుట్టు గ్రామంలో గోడపత్రికలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ, బహిరంగసభను గిరిజనులంతా తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు. మన్యం ప్రాంతంలో ఎస్టి మాలి, గౌడ్‌ ఉప తెగలను ప్రభుత్వ పథకాల వెబ్సైట్లో తొలగించడంపై బహిరంగ సభలో నేతలు ప్రస్తావిస్తారని తెలిపారు. ఈ ఉపకులాల వారంతా బహిరంగ సభకు కదిలి రావాలని పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాల్లో రహదారి, తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎంఎం శ్రీను, సిఐటియు మండల కార్యదర్శి భీమరాజు, శంకర్‌, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.