Sep 28,2022 09:11

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : మానవ హక్కుల కమిషన్‌కు గతేడాది కాలంగా 2800 ఫిర్యాదులు అందాయని కమిషన్‌ సభ్యులు దండే సుబ్రమణ్యం, గోచిపాత శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మాంధాత సీతారామమూర్తి ఆధ్వర్యంలో రెండు రోజులుగా గుంటూరులో మొత్తం 56 కేసులకు గాను, 41 కేసులు విచారణ చేసి, 17 కేసుల్లో తీర్పునిచ్చారని తెలిపారు.