Jan 19,2022 10:23

న్యూఢిల్లీ : రెండు రోజుల నుండి కరోనా కేసులు కాస్త తగ్గినట్లు కనిపించినప్పటికీ.. బుధవారం నాడు పెరిగాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మంగళవారం 18 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టగా.. 2.82 లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. క్రితం రోజుతో పోలిస్తే 18 శాతం అదనం. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో 441 మంది మరణించారు. దీంతో కరోనా మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు 3.79 కోట్ల మందికి పైగా ప్రజలు మహమ్మారి బారిన పడగా... 4.87 లక్షల మంది కరోనాకు బలయ్యారు. పాజిటివిటీ రేటు  14.43 శాతం నుండి 15.13 శాతానికి పెరిగింది. దేశంలో ఒమిక్రాన్‌ కేసులు 8,916కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,88,157 మంది కోలుకోగా.. మొత్తంగా 3.55 కోట్ల మంది మహమ్మారిని జయించారు. ప్రస్తుతం క్రియా శీల కేసులు 18 లక్షలుగా ఉన్నాయి. క్రియా శీలక రేటు 4.83 శాతానికి పెరిగింది. క్రితం రోజు 76,35,229 మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 158 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.