Sep 27,2022 10:21

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై ఈ నెల 29న అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఈ మేరకు విచారణ జాబితాలో ఈ పిటిషన్‌ను సుప్రీం కోర్టు పెట్టింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్ కిషన్‌, జస్టిస్‌ అభయ్ తో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది.