
ముంబయి : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడుతోంది. శివసేన నుండి ఒక్కొక్కరుగా రెబల్ గూటికి చేరుతున్నారు. తాజాగా మంగేష్ కుడల్కర్, సదా సర్వంకర్, దీపక్ కేశర్‌కర్ తిరుగుబాటు ఎమ్మెల్యేలున్న హోటల్‌కు చేరుకున్నారు. గురువారం వీరంతా ముంబయి నుండి అసోంలోని గువహటికి విమానంలో చేరుకున్నారని రెబల్ నేత ఏక్నాథ్ షిండేకు సన్నిహితులు తెలిపారు. వీరితో పాటు స్వతంత్య్ర ఎమ్మెల్యే సైతం ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ గవర్నర్‌ను కలిసే అవకాశాలున్నాయి. శివసేనలో మూడింట రెండొంతుల మెజార్టీ తనవైపే ఉన్నారని ఏక్నాథ్ షిండే చెబుతున్నారు. తమదే అసలైన శివసేన పార్టీ అని, శాసనా సభ పక్ష నేతగా ఏక్నాథ్ షిండేను ధ్రువీకరించాలని గవర్నర్‌కు పార్టీ నేతలు లేఖ రాశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ ఎమ్మెల్యేల సంఖ్య సరిపోనందున.. బిజెపితో చేతులు కలిపే వీలుంది.