Sep 25,2021 12:51

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు శనివారం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించాయి. 30 వేల దిగువకు కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో తాజాగా 29,616 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,36,24,419కు చేరింది. మరో 290 మంది మరణించగా.. ఇప్పటి వరకు 4,46,658 మంది మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 28,046 మంది బాధితులు కోలుకోగా.. ఇందులో 3,28,76,319 మంది బాధితులు వైరస్‌ నుంచి బయటపడినట్లైంది. దీంతో రికవరీ రేటు 97.78 శాతానికి చేరిందని తెలిపింది. ఇక కేరళలో తాజాగా 17,983 కేసులు నమోదు కాగా, 127 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 71,04,051 మందికి వ్యాక్సినేషన్‌ వినియోగం జరగ్గా... దీంతో ఇప్పటి వరకు మొత్తం 84,89,29,160 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ అయ్యాయి.