Oct 28,2021 13:26

కొడుగు : కర్ణాటకలోని కొడుగు జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయలో చదువుతున్న 32 మంది విద్యార్థులు కరోనా బారినపడటం కలవరం రేగింది. వీరిలో 10 మంది బాలికలు కాగా, 22 మంది బాలురు. వీరంతా 9 నుండి 12 తరగతి మధ్య చదువుతున్న విద్యార్థులే. ఈ మొత్తంలో 10 మంది విద్యార్థులు కరోనా లక్షణాలు కన్పించగా.. మిగిలిన వారికి ఎటువంటి లక్షణాలు కన్పించలేదు. ఈ పాఠశాల్లో మొత్తం 270 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక స్టాప్‌ సభ్యుడు కూడా కరోనా బారిన పడ్డారు. వీరంతా జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. కాగా, ఏ ఒక్కరి పరిస్థితి కూడా క్రిటికల్‌గా లేదని స్కూల్‌ ప్రిన్సిపల్‌ పంకజ్‌షాన్‌ తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పాఠశాలలను శానిటైజ్‌ చేశామని, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌, ఆరోగ్యాధికారి గురువారం పాఠశాలను సంద్శించారు.