
ప్రజాశక్తి - బాపట్ల
టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో స్థానిక సూర్యలంక రోడ్డులోని టిడిపి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ 321వ రోజుకు చేరింది. మంగళవారం జమ్ములపాలెంకు చెందిన దివంగత నూతలపాటి సుబ్బారావు వర్ధంతి సందర్భంగా భార్య సుబ్బరావమ్మ, కుమారుడు శేషగిరిరావు సహకారంతో 350మంది పేదలకు అన్న వితరణ చేశారు. పేదల ఆకలి తీర్చేంతటి మంచి కార్యక్రమంలో భాగస్వాములై తమ సహకారాన్ని అందించిన దాతలకు నరేంద్ర వర్మ ధన్యవాదాలు తెలిపారు.