May 25,2023 21:27

బెంగళూరు : వినోద పార్కుల నిర్వహణ సంస్థ వండర్‌లా హాలిడేస్‌ 2023 మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.35.05 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.38.9 కోట్ల లాభాలు ఆర్జించింది. దీంతో పోల్చితే గడిచిన త్రైమాసికంలో 10 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. క్రితం మార్చి త్రైమాసికంలో రూ.112.63 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2022 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇది రూ.117.75 కోట్లుగా ఉంది. ఈ సంస్థ హైదరాబాద్‌, కొచ్చి, బెంగళూరులో వండర్‌లా పార్కులను కలిగి ఉంది.