Apr 20,2021 21:47

భోజన శాలలో ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి చెరుకువాడ

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి చెరుకువాడ
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి రోగుల సహాయకులకు ఉచిత భోజన సదుపాయాన్ని మే మూడో తేదీన ప్రాంరంభిం చాలని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగ నాథరాజు నిర్ణయిం చారు. జిజిహెచ్‌లో జరుగు తున్న భోజన శాల ముగింపు నిర్మాణ పనులను మంగళవారం మంత్రి శ్రీ రంగనాధ రాజు పరిశీలించారు. ఒకేసారి 300 మంది భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడకుండా ఏర్పాట్లు పూర్తి చేయడం పై ఆయన సంతప్తి వ్యక్తం చేశారు. మొత్తం 25 డైనింగ్‌ టేబుల్స్‌ ను ఏర్పాటు చేయాలని అందులో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 12 , మొదటి ఫ్లోర్‌ లో 13 టేబుల్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రోగుల సహాయకులు సంతప్తిగా భోజనం చేసి విధంగా ఏరాట్లు చేయాలని సూచించారు. మంచినీరు, డ్రైనేజీ సిస్టంల గురించి ఆరా తీశారు. వాటిని పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి, సివిల్‌ సర్జన్‌ ఆర్‌ యం ఓ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌, గహ నిర్మాణ శాఖ పిడి వేణుగోపాల్‌ రావు, రెడ్‌ క్రాస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్ర రాజు పాల్గొన్నారు.