Mar 18,2023 12:26

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో బస్సు అదుపు తప్పి బోల్తాపడింది. శనివారం జరిగిన ఈ ఘటనలో నలుగురు ప్రయాణీకులు మృతి చెందారని, 28 మందికి గాయాలయ్యాయని పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దక్షిణ కాశ్మీర్‌ జిల్లా పుల్వామాలోని బర్సూ ప్రాంతంలో శ్రీనగర్‌ - జyమ్మూ నేషనల్‌ హైవేపై ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బస్సు నడుపుతున్న డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణీకులు నలుగురు బీహార్‌కు చెందినవారని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో గాయపడిన 28 మందిని చికిత్స కోసం ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉందని పోలీసులు పేర్కొన్నారు.