Aug 07,2022 08:16

ఓహియో (అమెరికా) : తూటాల శబ్దంతో అమెరికాలోని ఓహియో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అమెరికాలోని ఓహియోలోని బట్లర్‌ టౌన్‌షిప్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో నలుగురు మృత్యువాత పడ్డారు. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నట్లు స్థానిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. బట్లర్‌ టౌన్‌షిప్‌ పోలీస్‌ చీఫ్‌ జాన్‌ పోర్టర్‌ మాట్లాడుతూ.. ఈ కాల్పులకు స్టీఫెన్‌ మార్లో తెగబడి ఉంటాడని భావిస్తున్నట్లు తెలిపారు. అతడు చాలా ప్రమాదకారి అని పేర్కొన్నారు. అతడ్ని పట్టుకునేందుకు మోంట్‌గోమెరీ కౌంటీ షెరీఫ్‌ కార్యాలయం, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బిఐ), బ్యూరో ఆఫ్‌ ఆల్కహాల్‌, టోబాకో, ఫైర్‌ ఆర్మ్‌, ఎక్స్‌ప్లోజివ్స్‌(ఎటిఎఫ్‌) అధికారులకు సాయం చేస్తున్నాయని తెలిపారు. నిందితుడ మార్లో ఓహియో నుండి పారిపోయి ఉండవచ్చునని సమాచారం అందినట్లు చెప్పారు. లెక్సింగ్టన్‌, కెంటుకి, ఇండియానా పోలీస్‌, చికాగోతో మంచి సంబంధాలు ఉన్నాయి. వీటిలో ఏదో ఒక నగరంలో దాక్కొని ఉండవచ్చునని ఎఫ్‌బిఐ ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా అతడి ఎలా ఉంటాడన్న వివరాలను, ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మార్లో గురించి సమాచారం తెలిస్తే ఎఫ్‌బిఐకి సంప్రదించాలని పేర్కొంది.