Aug 19,2022 13:50

ముంబయి : మహారాష్ట్రలోని ముంబయి నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. బరివలీ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం శుక్రవారం కుప్పకూలింది. ప్రాణనష్టం గురించి ఎటువంటి సమాచారం ఇప్పటి వరకు అందలేదు. భవనం శిథిలావస్థకు చేరిందని, దాని నుండి నివాసితులను ఖాళీ చేయిస్తామని అధికారులు తెలిపారు. అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని.. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారో లేదో అని తనిఖీలు చేస్తున్నారు. ఎనిమిది ఫైర్‌ ఇంజన్లు, రెండు రెస్క్యూ వ్యాన్‌లు అక్కడ ఉన్నాయి.