
తజికిస్తాన్ : తజికిస్తాన్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 4.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వెడల్పు : 37.90, పొడవు : 73.70, లోతు : 50 కిలోమీటర్లలో ఈ భూకంపం సంభవించినట్లు ఎన్‌సిఎస్ ట్వీట్‌లో పేర్కొంది. భూకంపం వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం వంటి వివరాలు తెలియాల్సి ఉంది.