
అటిక్విపా : పెరూలో మంగళవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.7గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దక్షిణ అమెరికాలో ఓ దేశమైన పెరూలోని అటిక్విపాకు దక్షిణ నైరుతి దిశలో 41 కి.మీ దూరంలో భూకంపం సంభవించింది. అమెరికా కాలమాన ప్రకారం 5.30 గంటల సమయంలో 20.6 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు యుఎస్‌జిఎస్ తెలిపింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.