Jul 03,2022 22:32


ప్రజాశక్తి-రాజోలు
వాసవి క్లబ్‌ ఇంటర్నేషనల, వాసవి వనిత క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం బి.సావరం గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు 40 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు కాసు శ్రీను మాట్లాడుతూ నేటి సమాజంలో విద్య అనేది చాలా ప్రాముఖ్యమైనదన్నారు. అటువంటి విద్యను అభ్యసించుటకు విద్యార్థులకు పేదరికం అనేది శాపం కాకూడదని భావించి తమవంతు సహాయం అందిస్తున్నామని అన్నారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఎటువంటి సహాయం అయినా అందించుటలో తమ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. రాజోలు మండలంలోని నాలుగు పాఠశాలలతో పాటు, భవితా కేంద్రానికి షెల్ఫ్‌ను అందజేశామన్నారు. కార్యక్రమంలో వాసవి క్లబ్‌ ఇంటర్నేషనల్‌ ప్రతినిధులు, వనిత క్లబ్‌ అధ్యక్యురాలు కాసు భవాని, జెంట్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు కాసు సతీష్‌, హెచ్‌ఎంలు గటిగంటి శ్రీనివాస్‌, కాసు శ్రీనివాస రంగనాయకులు, లక్కింశెట్టి మీనాక్షమ్మ, కొత్తా పద్మావతి వెత్సా బద్రి, విద్యా కమిటీ ఛైర్పర్సన్‌ కోరుకొండ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.