Nov 21,2020 21:57

గ్రేటర్‌ విశాఖ బ్యూరో: హిందూ మహాసముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగేయ బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం ఏర్పడడం వల్ల దక్షిణ, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. రాగల 48 గంటల్లో వాయుగుండంగా మారి, ఈ నెల 27 నాటికి మరింతగా బలపడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఇది పశ్ఛిమ వాయువ్య దిశవైపు కదులుతూ, శ్రీలంక-దక్షిణ తమిళనాడు తీరం వైపు ప్రయాణించి నవంబర్‌ 25న తమిళనాడు, పాండిచేరి తీరానికి చేరుతుందని తెలిపారు. వీటి ప్రభావం వల్ల రాగల 48 గంటలలోపు ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.