
ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాథికార సంస్థ - ఆంధ్ర చెస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 4వ తేదీన నగరంలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో శాప్ చెస్ పోటీలను నిర్వహించనున్నట్లు శాప్ మేనేజింగ్ ఢైరెక్టర్ డాక్టర్ యన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. నగరంలోని ఐజిఎంసి స్టేడియంలోని శాప్ కార్యాలయంలో బుధవారం ఉదయం పోటీలకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీలకు వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా పాఠశాల విద్యార్ధినీ, విద్యార్థులు పాల్గొనవచ్చని తెలిపారు. పాఠశాల, కళాశాల విద్యార్థులకు విడి విడిగా పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. చెస్ రేటింగ్ 1500లోపు ఉన్న క్రీడాకారులందరూ టోర్నమెంట్లో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ పేర్లను క్రింది ఫోన్ నెంబర్ ద్వారా తెలుసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు. వివరాలకు 9030308811 ద్వారా సంప్రదించవచ్పచని తెలిపారు.