Apr 08,2021 19:56

ఫొటోట : మాట్లాడుతున్న ఎస్‌ఇబి అధికారిణి శ్రీలకీë

ఫొటోట : మాట్లాడుతున్న ఎస్‌ఇబి అధికారిణి శ్రీలకీë
50 కేజీల గంజాయి స్వాధీనం
- ఐదుగురు నిందితుల అరెస్టు
ప్రజాశక్తి-నెల్లూరు : స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నర్సీపట్నం, విజయవాడ ప్రాంతాల నుంచి తిరుపతి, చెన్నరు, కుప్పం ప్రాంతాలకు ఆర్‌టిసి బస్సులలో అక్రమంగా తరలిస్తున్న 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు నిందితులను ఎస్‌ఇబి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం నగరంలోని స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో కార్యాలయంలో ఎస్‌ఇబి అధికారిణి కె.శ్రీలక్ష్మి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జెడ్‌పిటిసి, ఎంపిటిసి, తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్‌ఇబి కమిషనర్‌ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామన్నారు.
రాత్రి 10 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఇద్దరు అధికారుల ఆధ్వర్యంలో 16 బృందాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాహనాలు తనిఖీ చేశామన్నారు. వెంకటాచలం టోల్‌ ప్లాజా సమీపంలో నిర్వహించిన వాహనాల తనిఖీలలో ఆర్‌టిసి, ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సులలో తరలిస్తుండగా ఈ గంజాయిని గుర్తించామన్నారు. తాము స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్‌లో సుమారుగా రూ.35 లక్షల విలువ ఉంటుందన్నారు. గంజాయిని తరలిస్తున్న తుట్టా రత్నం, నాగల దుర్గ, రాజేంద్రన్‌ కుమార్‌, శ్రీనప్ప, గోవింద రాజులను నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారం రోజుల్లో సుమారు వంద కేజీల గంజాయిని ఎస్‌ఇబి అధికారులు చేసిన తనిఖీలల్లో గుర్తించామన్నారు. తాము నిర్వహించిన తనిఖీలలో గుర్తించిన గంజాయి వైజాగ్‌ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా పట్టుబడిందే కాని నగరంలో పట్టుబడింది కాదన్న విషయాన్ని గుర్తు చేశారు.